సిద్దిపేట, బతుకమ్మ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో ఆయన్ను కలిశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కమిషన్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.