మరోసారి కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ
బుధవారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్న కేసీఆర్ గజ్వేల్, బతుకమ్మ : గజ్వేల్ ప్రాంతంలోని ఎ ర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మంగళవారం మరోసారి కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ అయ్యారు. బుధవారం కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో ఈభేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పాల్సిన అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం 5 గంటల పాటు కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ అయిన విషయం తెలిసిందే.