హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో బుధవారం ఈసమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రోడ్ షోలు, ప్రచార వ్యూహాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన , పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని వివిధ ప్రాంతాల ఇన్ చార్జులతో గురువారం కేసీఆర్ సమావేశం కానున్నారు.