Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2025, 5:34 pm Posted by : ramakrishna

హరిపూర్ రామాలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

ఆర్మూర్, బతుకమ్మ  : ఆర్మూర్ మండలం లోని హరిపూర్ (చేపూర్) గ్రామంలోని శ్రీ రామాలయ నూతన కమిటీ కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా రాంపట్ల నరసయ్య, కార్యదర్శి ఆదిరాజు, కోశాధికారి మనోహర్ గౌడ్ (అలియాస్ కపిల్ గౌడ్), సభ్యులుగా దూర్కి లక్ష్మణ్, లక్ష్మీకాంత్, ఏనుగుంటీ లింబాగౌడ్, తోటపల్లి నర్సింగ్, దుర్కి బాబు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో శ్రీరామాలయ టెంపుల్ ను అభివృద్ధి పథం లో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.