Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2024, 7:46 pm Posted by : ramakrishna

చోరిఐనా బంగారు గోలుసు కోసం మంత్రగాళ్ల వద్ధ విద్యార్థినికి వేదింపులు

 అధికారుల అనుమతి లేకుండా మంత్రికుడి వద్ధకు కేజిబివి విద్యార్థినీ

 . . . సిఆర్టి బంగారు గోలుసు మాయం నేపథ్యంలో మాక్లూర్ కేజిబివిలో దారుణం

. . .  వివాధల పుట్టైనా మాక్లూర్ కేజిబివిలో కోత్త

 నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లాలో ఓక కేజిబివిలో దారుణం జరిగింది. సైన్స్, విజ్ఞానం గురించి బోధించే ఉపాధ్యాయులు బంగారు గోలుసు పోయిందని మూఢనమ్మకాల తో మాంత్రికుల వద్ధకు తీసుకువేళ్లి విద్యార్థినీలను తీసుకువేళ్లి వేదించారు. ఈ సంఘటన శుక్రవారం అలస్యంగా వెలుగు చూసింది.  మాక్లూర్ కేజిబివిలొ జరిగిన దారుణ అమానుష సంఘటన కు సంబందించిన బాధిత విద్యార్థీనీల విడియోలను విద్యార్థి సంఘాలు, బాధితులు సొషల్ మిడియాలో వైరల్ గా మారాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్ కేజిబివిలో ఓక మహిళ సిఆర్ టికి సంబందించిన బంగారు గోలుసు పోయింది. అందుకు అందరు విద్యార్థినీలను అసెంబ్లి చేసి బంగారు గోలుసును తీసింది ఎవ్వరు అని అందరిని చేడమడా తిట్టారు. అంతటితో ఉరుకోకుండా ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని నందిపేట్ మండలంలోని ఓక దర్గాకు తీసుకువేళ్లి మసిపూసీ పోర్లు దండాలు పెట్టించినట్టు తెలిసింది. అంతటితో ఉరుకోకుండా వారే స్థానిక పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు తెలిసింది.  విద్యార్థినీలను అధికారుల  అనుమతి లేకుండా దారుణంగా బయటకు తీసుకువేళ్లి వేదించిన ఉధంతంలో కేజిబివి అధికారుల పాత్ర ఉందని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి.మాక్లూర్ కేజిబివి ఇటివల కాలంలో వివాదాల పుట్టగా మారింది. సంబందిత వివాధంపై జిసిడిఓ అధ్వర్యంలో జరిగిన విచారణ కోలిక్కి రాకముందే మరో వివాధం వెలుగు చూసింది. నిజామాబాద్ కు చెందిన అధికార పార్టికి చెందిన ఓక కార్పొరేషన్ చైర్మెన్ మాక్లూర్ కేజిబివి వివాధంలో విద్యాశాఖాధికారుల చర్యలకు మోకాలడ్డుతున్నట్టు గుస గుసలు ఉన్నాయి. మాక్లూర్ కేజిబివిలో బంగారు గోలుసు పోయిందని చిన్నారులను మాయలు మంత్రాగాళ్ల చూట్టు తింపిన వివాధంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. భాధ్యులైన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  మాక్లూర్ కేజిబివిలో వెలుగు చూసిన వివాధంపై జిల్లా విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్ ను బతుకమ్మ వివరణ కోసం పోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించిన  స్పంధించలేదు.