- రాష్ట్ర కమీషనర్ కు ఫిర్యాదు
- విచారణ చేపట్టిన అధికారయంత్రాంగం
బతుకమ్మ, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వేధింపుల వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఆ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొందరు రాష్ట్ర కమీషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోని ఒక అనుబంధ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పనిచేస్తున్న ఉద్యోగిపై ఆరోపణలు రావడంతో దానిపై రాష్ట్ర కమీషనర్ విచారణకు ఆదేశించారు. కమీషనర్ ఆదేశాల మేరకు జిల్లా పాలన అధికారి జిల్లాలోని ఒక శాఖాధిపతికి విచారణ భాధ్యతలు అప్పగించగా మార్చీ 29న విచారణ జరిపినట్లు తెలిసింది. అ విచారణ ముగియలేదని ఈ నెల మొదటి వారంలో మరికొంతమంది ఉద్యోగులను విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో చిరు ఉద్యోగిగా చేరి అంచలంచేలుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఒక అనుబంధ విభాగంకు అధిపతిగా పనిచేస్తున్న సదరు ఉద్యోగి కొందరిని అధికారులకు తెలియకుండా నియమాకం, కొందరు మహిళా ఉద్యోగినీలపై వేధింపులు, దత్తత కార్యక్రమంలో కాసుల డిమాండ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై కొందరు ఆకాశ రామన్న ఉత్తరం ద్వార ఫిర్యాదు చేయడంతో శాఖాపరంగా వివరాలు తెలిసుకున్న తరువాత విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. గతంలో పనిచేసిన మహిళా ఉద్యోగి తనకు విధుల పరంగా ఎదురైన వేధింపులతో పాటు బేటీ పడావో, బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా జరిగిన అవినీతిపై, దత్తత తీసుకునే దంపతుల వద్ద వసూళ్ల వ్యవహరం ప్రధానంగా ఈ విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. గత శనివారం ఐసిడిఎస్ కార్యాలయంలో జరిగిన విచారణ పూర్తి కాకపోవడంతో ఈ వారం మళ్లీ విచారించనున్నట్లు సమాచారం. మహిళలకు, యువతులకు, ఉద్యోగినీలకు, విద్యార్థినీలకు రక్షణ కల్పించే శాఖలో జరిగిన వేధింపుల వ్యవహరం కలకలం రేపుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగి వ్యవహరం పై గతంలో ఫిర్యాదులు వచ్చిన విచారణ జరుగలేదని, ప్రస్తుతం మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారనే చర్చ ఆ శాఖలో జరుగుతుంది. విచారణ నివేధిక ఆధారంగా చర్యలు ఖాయంమని చర్చ జరుగుతుండగా గతంలో మాదిరిగానే అడ్డుకునేందుకు పైరవీలు జరుగుతున్నట్లు తెలిసింది.