Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 8:46 pm Posted by : ramakrishna

విద్యుత్ ఉద్యోగిపై వేధింపుల కేసు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

సహచర మహిళా ఉద్యోగినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన విద్యుత్ శాఖ ఉద్యోగిపై పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారు. నగరంలోని పవర్ హౌస్ కాంపౌండ్ లో నిజామాబాద్ విద్యుత్ శాఖ డీఈఈ (ఆపరేషన్) కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కార్తీక్ పై 5వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఈఈ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వెంటనే మహిళా ఉద్యోగిని కుటుంబ సభ్యులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు 5వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహిళా ఉద్యోగిని ఫిర్యాదు మేరకు కార్తీక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు 5వ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు.

. . . జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

నిజామాబాద్ పవర్ హౌస్ కాంపౌండ్ లోని విద్యుత్ శాఖ డీఈఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కార్తీక్ ని సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ విద్యుత్ శాఖ ఎస్ ఈ రాజేశ్వర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. తోటి మహిళా ఉద్యోగినిని వేధింపులకు గురి చేయడంతో పోలీసు కేసు నమోదు కాగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు.