. . . జాతీయ జెండాలతో పట్టణ ప్రధాన వీధుల్లో బీజేపీ శ్రేణుల ర్యాలీ
బాన్సువాడ, బతుకమ్మ :
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతదేశ చరిత్ర, సంస్కృతి, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యత, సమగ్రతను చాటాలని పిలుపునిచ్చారు. ‘నా దేశం.. నా జెండా.. నా గౌరవం’ అనే భావన ప్రతి భారతీయుడిలో నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చీదురు సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, బీజేపీ కౌన్సిలర్ గజ్జల మహేష్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు ప్రసాద్ కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు హనుమాన్లు, ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ పంతులు, నాయకులు లక్ష్మీనారాయణ, చీకట్ల రాజు, శ్యామల శ్రీకాంత్, పాశం భాస్కర్ రెడ్డి, శివశంకర్, కొండని గంగారం, సాయిబాబా, యోగి పురు షోత్తం, సచిన్, ప్రదీప్, మహేందర్, పద్మ, నరేష్, సాయిరెడ్డి, భూమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
