స్వాతంత్య్ర సమరయోధుల స్మరణకే ‘హర్ ఘర్ తిరంగా’
. . . కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటుకునేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాటిపల్లి వెంకట రమణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వాతంత్య్ర దినోత్సవాన్ని...