ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.లక్ష్మీనారాయణ జీవితంలో యోగ ప్రాధాన్యతను వివరించారు. ఆరోగ్యంగా జీవించడం ద్వారా దేశానికి ఎట్లా సేవ చేయవచ్చునని తెలిపారు. ప్రిన్సిపాల్, సిబ్బంది కొన్ని యోగాసనాలు వేసి వాటి ప్రాధాన్యత తెలియచెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రకాంత్, ఐ.క్యూ ఏ సి.సమన్వయకర్త డాక్టర్ వి.శంకరయ్య, టీఎస్ కేసి సమన్వయకర్త జంగం శివకుమార్, ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారులు చంద్రకాంత్, రాణి, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.