Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 2:12 pm Posted by : ramakrishna

ఘనంగా వీర బాల్ దివస్

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని  గాజుల్ పేట్ గురుద్వార్‌లో నిర్వహించిన వీర బాల్ దివస్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  హాజరై మాట్లాడారు.  సిక్కు చరిత్రలో వీర బాల్ దివస్‌కు ఉన్న గొప్ప ప్రాముఖ్యతను వివరించారు.  వారి త్యాగాలు దేశభక్తి, ధైర్యసాహసాలకు చిరస్మరణీయ ప్రతీకలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగొల్ల. లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ ప్రభాకర్,బీజేపీ మండల ప్రెసిడెంట్ బాబీ సింగ్, మఠం. పవన్, ముండాడ. పవన్,మరావర్. కృష్ణ గురుద్వార్ నిర్వాహకులు, సిక్కు సంఘ నాయకులు, , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.