Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2024, 3:17 pm Posted by : ramakrishna

సామూహిక వివాహాలు నిర్వహించడం సంతోషంగా ఉంది

రెండు జంటలకు వివాహం జరిపిన మాజీ మేయర్ ధర్మపురి సంజయ్

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

నిజామాబాద్ తొలి నగర మేయర్ ధర్మపురి సంజయ్ రెండు జంటలకు వివాహలు జరిపించారు.  ధర్మపురి సంజయ్ 53 జన్మదిన వేడుకల సందర్భంగా తన నివాసం వద్ధ శుక్రవారం రెండు పెధ జంటలకు వివాహలను ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సామూహిక వివాహాలను జరపడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 2005 వ సంవత్సరం ప్రారంభమైన సామూహిక వివాహాలు 2024 వరకు సుమారు 130 కి పైగా పెళ్లిళ్లను జరపడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. ఐటిఐ కాలేజీ వద్ద నివాసం ఉన్న ప్రజలు సుమారు 30,40 సంవత్సరాల అనుబంధం ఉండడంతో అక్కడున్న ప్రజలతోపాటు నాగారం ప్రాంత ప్రజలను కూడా కలుపుకొని వివాహాలను చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిపే ఈ వేడుకలకు కొద్దిగా నిరాశ కలిగినప్పటికీ విజయవంతంగానే కొనసాగుతూ ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ పెళ్లిళ్ల ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరిని కలుసుకోవడం బాగుందన్నారు. ఇందుకు సహకరించిన నిజామాబాద్ నగర ప్రజలు స్నేహితులు బంధువులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. పెళ్లిళ్లు చేసుకున్న దంపతులకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి బంధువులు అందరూ కలిసి ధర్మపురి సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగదీష్ కులకర్ణి, సాయిలు, ఆకుల చిన్న రాజేశ్వర్, ఫైనాన్సు రాము, వెంకట్, సాగర్, అనిల్, పెళ్లి పెద్దలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Happy to organize mass weddings