Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2024, 1:35 pm Posted by : ramakrishna

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

. పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: నగరంలోని దుబ్బ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మాష్టమి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఆలయంలో, గోమాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడిని, శ్రీరాముడిని కొలిస్తే ఎనలేని ఆశీస్సులు లభిస్తాయన్నారు. గోవధను Happy Shri Krishna Janmashtamiఅరికట్టేందుకు ప్రత్యేక చట్టాలున్నప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో దుబ్బ యాదవ సంఘం అధ్యక్షుడు బరకం నారాయణ, స్థానిక కార్పొరేటర్ పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్, భక్తవత్సలం నాయుడుతోపాటు నాగారం యాదవ సంఘం అధ్యక్షుడు దినేశ్ యాదవ్, కార్పొరేటర్ సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.