ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే  జయంతి పురస్కరించుకొని "మహిళా ఉపాధ్యాయ దినోత్సవం" ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గొప్ప సంఘ సంస్కర్త అని, మన దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయిని అని తెలిపారు. ఆమె కృషి ఫలితంగానే  స్త్రీల జీవితాల్లో విద్య అవకాలు కలిగాయని, వారిని స్ఫూర్తిగా తీసుకొని  అందరూ పని చేయాలని అన్నారు.  తెలుగు విభాగధిపతి డా. మేకల రామస్వామి మాట్లాడుతూ  మన...