జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు
. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ పండుగ ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ పండుగ జరుపుకోవాలని అభిలాషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.