ఇందల్వాయి, బతుకమ్మ : దీపావళి పండుగను పురస్కరించుకొని ఇందల్వాయి ప్రజలకు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు, ప్రజలందరు సుఖ సంతోషాలతో విర జిల్లాలని, ప్రజల జీవితాల్లో కష్టాలు కమ్మిన కారు చీకట్లు తొలగిపోయి దీపావళి పండగ నూతన కాంతులను ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి పండగను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి పండగను తగిన జాగ్రత్తలు పాటిస్తూ పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.