ఘనంగా ధన్వంతరి జయంతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ ఆయుర్వేద దినోత్సవం దన్వంతరి జయంతి సందర్భంగా జిల్లా ఆయుష్ శాఖ అధ్వర్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళా) దాస్ నగర్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆయుష్ విభాగం ఇంఛార్జి డాక్టర్ నారాయణ రావు మాట్లాడుతూ ఆయుర్వేదం పట్ల విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. ఈ సారి. "ఆయుర్వేద ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ హెల్త్"అనే నినాదం తో ఆయుర్వేద వైద్యం తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అన్నారు....