Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2024, 7:12 pm Posted by : ramakrishna

ఘనంగా ధన్వంతరి జయంతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  జాతీయ ఆయుర్వేద దినోత్సవం దన్వంతరి జయంతి సందర్భంగా జిల్లా ఆయుష్ శాఖ అధ్వర్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళా) దాస్ నగర్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆయుష్ విభాగం ఇంఛార్జి డాక్టర్ నారాయణ రావు మాట్లాడుతూ ఆయుర్వేదం పట్ల విద్యార్థినిలకు  అవగాహన కల్పించారు. ఈ సారి. “ఆయుర్వేద ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ హెల్త్”అనే నినాదం తో ఆయుర్వేద వైద్యం తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అన్నారు. అన్ని వ్యాధులకు చికిత్సలు ఉన్నాయని  తెలిపారు. విద్యార్థి నిలకు ఆయుష్ ఆరోగ్య కర దీపికలను పంపిణీ చేశామని తెలిపారు.  యోగ డాక్టర్ తిరుపతి యోగ ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు వేయించి యోగ పట్ల అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వర రావు  మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యానికి మంచి ప్రాముఖ్యత ఉందని, యోగ ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్య వంతులుగా ఉంటారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సరిత, ఆయుష్ విభాగం డీపీఎం వందన, ఆయుష్ ఫార్మ సిస్ట్ లు యన్. పురుషోత్తం, ఉమప్రసద్,కళాశాల లెక్చరర్స్ ఆయుష్ పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Happy Dhanwantari Jayanti