ఘనంగ రాజ్యాంగ దినోత్సవం
బతుకమ్మ, ఏర్గట్ల : ఉన్నత పాఠశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంతోమంది వీరుల త్యాగఫలంగా స్వాతంత్రం లభించగా,దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు రాజ్యాంగం తోడుపడిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశానికి ఉందని గుర్తు చేశారు.1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని, ఈరోజు నీ పురస్కరించుకొని 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని వివరించారు.సర్వసత్తాక, సామ్యవాద,లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారత్ ను రాజ్యాంగంలో నిర్వచించారని, 8 దశాబ్దాలుగా భారతదేశం...