బతుకమ్మ, ఏర్గట్ల : ఉన్నత పాఠశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంతోమంది వీరుల త్యాగఫలంగా స్వాతంత్రం లభించగా,దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు రాజ్యాంగం తోడుపడిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశానికి ఉందని గుర్తు చేశారు.1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని, ఈరోజు నీ పురస్కరించుకొని 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని వివరించారు.సర్వసత్తాక, సామ్యవాద,లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారత్ ను రాజ్యాంగంలో నిర్వచించారని, 8 దశాబ్దాలుగా భారతదేశం ఐక్యంగా సుస్థిరంగా ముందుకు వెళుతుందనేందుకు రాజ్యాంగంలోనే ఉన్నత ఆశయాలే కారణమని హెచ్ఎం కృష్ణ చారి, వివరించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ట్వింకిల్ కుమార్,గంగా మోహన్ స్కూల్లో వివిధ పోటీలు నిర్వహించారు. డ్రాయింగ్ కాంపిటీషన్లో 40 మంది విద్యార్థులకు పైగా పాల్గొన్నారు. రాజ్యాంగ పీఠికను, దాని ప్రాధాన్యతను విద్యార్థులు వివరించారు. వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్ కాంపిటీషన్, స్పీచ్, సాంగ్స్ వంటి వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మునీరుద్దిన్,ప్రసాద్, రాజశేఖర్,సమిత, ఎస్.శ్రీనివాస్, రాజేందర్, జ్యోతి, ట్వింకిల్ కుమార్, గంగామోహన్,రిషిక, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.