భిక్కనూరు, బతుకమ్మ: మండలంలోని పెద్ద మల్లారెడ్డిలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆధిపత్య వర్గాల పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ.. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడరని భిక్కనూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపనోళ్ల స్వామి రజక అన్నారు. కార్యక్రమంలో అశోక్, అనిల్, నారాయణ, స్వామి, రాజు, రమేశ్, నరేశ్ పాల్గొన్నారు.