Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2024, 6:16 pm Posted by : ramakrishna

ఘనంగా చాకలి ఐలమ్మ  జయంతి 

బతుకమ్మ, ఆర్మూర్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ధోబి ఘాట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.
ఈ సందర్భంగా  బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ “భూమికోసం, భుక్తి కోసం — వెట్టి చాకిరి విముక్తి కోసం” ” తెలంగాణ స్వతంత్రం కోసం — రజాకారులను తరమడం కోసం” బట్టలను బండపై ఉతకడమే కాదు అవసరమైతే కొడవలి పట్టి ఓ పులిలా రజాకారులను ఎదిరించినటువంటి ధీర వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. చాకలి ఐలమ్మ పేరును కోటి లోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ న్నామని, పేరు పెట్టగానే అక్కడ పరిస్థితులు మారవని మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఆ విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి మహిళలు చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాశేట్టి రాజ్ కుమార్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబిసి మోర్చ ఆర్మూర్ పట్టణ కార్యదర్శులు రెడ్డబోయిన దక్షిణ మూర్తి, బట్టు రాము, కార్యకర్తలు పోల మధు, చుక్క అనిల్ తదితరులు పాల్గొన్నారు.