Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 5:05 pm Posted by : ramakrishna

ఘనంగా సురేష్ శెట్కర్ జన్మదిన వేడుకలు

బతుకమ్మ, ఆగస్టు 8, బిచ్కుంద : జహీరాబాద్ పార్లమెంట్ మెంబర్ జన్మదిన వేడుకలను గురువారం బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువ నాయకులు సాహిల్ శెట్కార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సురేష్ షెట్కర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యువ నాయకులు సహీల్ మాట్లాడుతూ ఎంపీ సురేష్ శెట్కర్ నేతృత్వంలో జహీరాబాద్ నియోజకవర్గంఅన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. సురేష్ షెట్కార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద యువ నాయకులు సహిల్ శేట్కర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పాషా సెట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగనాథ్, చింతల హన్మాండ్లు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.