Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 2:12 pm Posted by : ramakrishna

రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

బతుకమ్మ, వెబ్‌డెస్క్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌ దీర్ఘాయుష్షుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని ప్రధాని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా ఇతర అగ్ర నేతలు కూడా రాహుల్‌ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో సింగ్‌ ఇలా రాశారు, ‘లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా కాంగ్రెస్‌ నేత రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తన ఆదర్శ సోదరుడు రాహుల్‌ గాంధీకి హఅదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలని పేర్కొన్నారు. తమ నేత పుట్టినరోజు సందర్భంగా ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ న్యూఢల్లీిలోని తల్కటోరా ఇండోర్‌ స్టేడియంలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది.