Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2024, 4:46 pm Posted by : ramakrishna

ఘనంగా ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు

బతుకమ్మ, మోర్తాడ్: తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పుట్టినరోజు వేడుకలను గురువారం మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ గిర్మాజీ గోపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ గిర్మాజి గోపి మాట్లాడుతూ మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పండ్లను పంపిణీ చేసామని చెప్పారు. అలాగే వందమంది పేద పిల్లలకు ఆహారాన్ని అందజేశామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈరవత్రి అనిల్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గిర్మాజీ లడ్డు గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ సదానందం గౌడ్, కమ్మర్పల్లి AMC డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, నసీర్, విజయ్, అశోక్, నరేష్, భూపతి, విక్రం గౌడ్, ప్రమోద్, గిర్మాజీ గంగాధర్, గుర్రం అశోక్, వంశీ, పెద్ది రామకృష్ణ, మహిళ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Happy birthday to Anil tonight