కామారెడ్డి, బతుమకమ్మ : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. కామారెడ్డి చరిత్రలో తొలిసారిగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఒకే శిబిరంలో సుమారు 436 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేదలకు

దుప్పట్లు, ఆహారం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తన అభిమానులకు కార్యకర్తలకు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని కోరానని, కానీ రక్తదాన శిబిరం ఏర్పాటు ఒకరికి ప్రాణదానంగా పుట్టినరోజు మలిచిన కార్యకర్తలకు, అభిమానులకు

హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారి ప్రేమాభిమానాలకు ఎప్పడికి రుణపడి ఉంటానన్నారు. తన జీవితాంతం తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా కామారెడ్డికి సేవ చేస్తూనే ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు. దాతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలను, హెల్మెట్లను పంపిణీ చేశారు.
