Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2025, 8:11 pm Posted by : ramakrishna

ఘనంగా శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో దక్షిణ ప్రాంగణంలో  సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని డాక్టర్ బి వీరభద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దక్షిణ ప్రాంగణం ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ బంజారాలలో వెలుగులు నింపిన మహనీయుడని 12 కోట్ల జనాభా కలిగిన బంజారాల ఆరాధ్య దైవం అని  సమాజంలోని రుగ్మతలను రూపుమాపి విద్యను ప్రతి మనిషికి అవసరమని దేశంలో జరుగుతున్న మత మార్పిడులను ఆనాడు అరికట్టాడని పంచ సూత్రాలైన సత్యం ,ధర్మం ,త్యాగం, శాంతి, ప్రేమ ఈ మానవాళికి అందించాలని వారి యొక్క అడుగుజాడలో నడవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి, భుక్య దేవ, బానోత్ చరణ్, డాక్టర్ అంజయ్య, డాక్టర్ సబిత,విద్యార్థుల పాల్గొన్నారు.