Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 September 2024, 4:55 pm Posted by : ramakrishna

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

బతుకమ్మ,మద్నూర్: మండలంలోని పెద్ద ఎక్లరా గ్రామం లో శనివారం పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన నిస్వార్థ సేవను కొనియాడారు.తెలంగాణ ఉద్యమంలో తాను ముందుండి తెలంగాణ ప్రజలను నడిపించారని, ఆయన కలలుగన్న తెలంగాణను భావితరాలు తెలంగాణ ప్రజలను నడిపించారని, ఆయన కలలుగన్న తెలంగాణను భావితరాలు గుర్తుంచుకొని ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెరిగేవార్ శ్రీనివాస్, కిషన్, పోశెట్టి, లక్ష్మణ్, బాలాజీ, రాములు తదితరులు పాల్గొన్నారు.