మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలంలో శనివారము రోజున భక్త మార్కండేయ స్వామి జయంతి సందర్బంగా మద్నూర్, మెనుర్ , పెద్ద ఎక్లర గ్రామలలో పద్మశాలి కులబందువులు నేతల ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి బజాన , సంగయ్య అప్ప స్వామి కీర్తన చేశారు. శనివారము తెల్లవారుజామున మార్కండేయుని అభిషేకము, పూజ, మంగళ హారాతి నిర్వహించారు. ఉదయము గ్రామం గుండ మోటార్ సైకిల్ ర్యాలి చేపట్టారు, ఉదయము 10 గంటల నుండి కీర్తన బాలు మహారాజ్ మార్కండేయ ప్రవచనము చెప్పారు. మహిళలు మార్కండేయ స్వామిని బారసాల వేసి మంచి పాటలు పడినరు అనంతరము మహా అన్నా ప్రసాదము నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పద్మశాలి రాష్ట్ర జయింట్ సెక్రట్రి డక్టర్ సుంకీవార్ రామన, మండల కార్యనిర్వాహకా అద్యక్షులు రచ్చ రచ్చ కుశాల్సుంకీవార, కోసాదికరి హుష్కల్ వెంకుల్, అలయ కమిటి అద్యక్షులు నగనాథ్, ఉప అద్యక్షులు సురేష్, మేత్రి రచ్చ నాగేశ్, మిడియ అద్యక్షులు సుంకీవార్ శ్రీధర్ అలయ కమిటి సబ్యులు శేషికాంత్, జగదీష్, కోసాదికరి ఉత్తుత్ శ్రీను , పూజారీలు మహేశ్ మహారాజ్, ఓం మహారాజ్, గోపి వారకరి భాజన మండలి , పద్మశాలి కులబందువులు, నాయకులు, భక్తజనులు ఆదిక సంఖ్యలో పాల్గొన్నారు.
