Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 5:51 pm Posted by : ramakrishna

మేరు కులస్థులకు కుట్టు మిషన్ల పంపిణిలో ప్రాధాన్యతపై హర్షం

 

. . . బీసీ సంఘం నగర ప్రధాన కార్యదర్శి కొట్టూర్ చంద్రకాంత్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నియోజక వర్గానికి వెయ్యి కుట్టు మిషన్ల పంపిణీలో మేరు కులస్తులకు సింహాభాగం పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంపై బీసీ సంఘం నగర ప్రధాన కార్యదర్శి, జిల్లా మేరు సంఘం ఉపాధ్యక్షులు కొట్టూర్ చంద్రకాంత్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలో బీసీ సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొట్టూర్ చంద్రకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం నియోజకవర్గంలోని బీసీ మహిళలకు వెయ్యి కుట్టు మిషన్ల పంపిణీలో మేరు కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా మేరు సంఘం అనేక పర్యాయాలు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ను, బీసీకార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ని కలిసినట్లు తెలిపారు. అప్పటికే జారీ అయిన జీవోను మీ న్యాయమైన కోరిక మేరు కులస్థుల జీవనదారమైన కుట్టు మిషన్ లు మీకు దక్కాలని ఏదో రకంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన దరిమిల మంత్రి పొన్నం ప్రభాకర్ మేరు కులస్థులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని గైడ్ లైన్స్ ఇవ్వడం పై హర్షం వ్యక్తం చేశారు.  గైడ్ లైన్స్ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. మేరు కులస్థులు నేటి నుండి వచ్చేనెల సెప్టెంబర్ 15 వరకు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు,  కుల, ఆధాయ పత్రాలతో పాటు టైలర్ ట్రైనింగ్ సర్టిఫికెట్, ఫోటోతో టీజీవోబీఎంఎంఎస్  పోర్టల్ లో అప్లయ్ చేసి అట్టి కాపీని ప్రింట్ తీసుకుని అప్లికేషన్ ప్రింట్ కాపీ తో పాటు పై సర్టిఫికెట్ ల జిరాక్స్ కాపీలను జత చేసి బీసీ వెల్ఫేర్ ఆఫీస్ లో అందించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్, మేరు సంఘ నాయకులు మంతెన దశరథ్, ఎన్ను పండరి, విప్లవ కుమారి, అరుణ్ చంద్, దీకొండ లక్ష్మణ్,మాకుల్లా శ్రీనివాస్, కాప్లయ్ రవి లు పాల్గొన్నారు.