Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 9:05 pm Posted by : ramakrishna

రుద్రూర్ నుండి కొండగట్టు వరకు హనుమాన్ స్వాముల పాదయాత్ర

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన హనుమాన్ స్వాములు శనివారం రుద్రూర్ గ్రామంలోని పెద్ద హనుమాన్ మందిరం నుండి కొండగట్టు వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, కీర్తనలతో పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పాదయాత్రగా బయలుదేరి వెళ్లిన వారిలో మంగళి శ్యామ్ స్వామి, అక్కపల్లి గంగాధర్ స్వామి, అగ్గు శ్రీను స్వాములు ఉన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.