బతుకమ్మ, బోధన్: చైత్ర మాస శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు లోని మారుతి మందిరంలో దేవాదాయ ధర్మ శాఖ ఆదేశానుసారం గురువారం రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ శనివారం వరకు, మూడు రోజుల వరకు కొనసాగుతాయని, అందులో భాగంగా మొదటి రోజు మహా కలశ స్థాపన, సర్వతో బ్రహ్మాది మండల దేవత మాత్రికా నవగ్రహ హనుమ దేవత పంచామృత మహా పూజ, చర విగ్రహ మండపారాధన చేయడం జరిగింది. దేవాలయ అధ్యక్షులు గుండేడి శంకర్ హనుమదీక్షపరులు రాజశేఖర్ దంపతులచే ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో గణపతి, నవగ్రహారాధన, స్వామివారికి పంచామృతాభిషేకము, మంత్ర పత్ర పుష్పాంజలి మంగళ నీరాజనాలు నైవేద్యాలు ఇత్యాది విశేష పూజలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి నాయకం రాములు, అర్చకులు, పాలక ధర్మకర్త మండలి సభ్యులు కిరణ్, మాధప్ప, శంకర్, హనుమాన్ భక్తులు తదితర భక్తులు పాల్గొనడం జరిగింది. శనివారం రోజు ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు మంగళ నిరాజనాలు యజ్ఞ యాగాదులు, నిర్వహించడం జరుగుతుందని, భక్తుల కోసం అన్నప్రసాదవితరణ కూడా నిర్వహించడం జరుగుతుందని, కావున భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకోవాలని ఆలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు.