Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 8:28 pm Posted by : ramakrishna

పెద్ద బోనాలలో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి

 

. . . మహా అన్నదాన కార్యక్రమం

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :

 

హనుమాన్ జయంతి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా విలీన గ్రామమైన పెద్ద బోనాల 22వ వార్డు లో హనుమాన్ దేవాలయంలో ఉదయం చందనోత్సవం, పూజలు, యజ్ఞం చేసి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయస్వామికి పూజ నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. వేముల శ్రీనివాస్ పంతులు ఆధ్వర్యంలో గాయకులు నక్క శ్రీకాంత్, మల్యాల నారాయణ గౌడ్, బండి బాలకిషన్, బోడ తిరుపతి, శ్రీనివాస్ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు, బోల్గాం నాగరాజు, ఎరుపుల దేవయ్య, బైరగోని రమేష్ గౌడ్, నక్క ఎల్లయ్య, పంగ రవి, అన్నారం రాజలింగం, నక్క పరశురాములు, ప్రశాంత్ గౌడ్, మాడుదుల మహేందర్, కాసేట్టి శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు కాంభోజ ముత్యం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

Hanuman Jayanti celebrated in grand style in big bonas