హనుమండ్లు అందరికీ ఆదర్శం
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామానికి చెందిన హనుమండ్లు అందరికీ ఆదర్శమని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయి గౌడ్ అన్నారు. హనుమండ్లు దివ్యాంగుడై క్షేత్ర సహాయకుడిగా పని చేస్తూ గ్రామంలోని అనేక దివ్యాంగులకు పని దినాలు కల్పించినందు గాను అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయనను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రశంస పత్రం అందించి అభినందించారు. ఈ విషయం తెలుసుకొని మోర్తాడ్ ఏపీవో శకుంతల, ఉపాధి హామీ సిబ్బంది ఆయనను అభినందించారు. మండల కేంద్రములో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు మిఠాయిలు...