Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 3:21 pm Posted by : ramakrishna

హనుమండ్లు అందరికీ ఆదర్శం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామానికి చెందిన హనుమండ్లు అందరికీ ఆదర్శమని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయి గౌడ్ అన్నారు. హనుమండ్లు దివ్యాంగుడై క్షేత్ర సహాయకుడిగా పని చేస్తూ గ్రామంలోని అనేక దివ్యాంగులకు పని దినాలు కల్పించినందు గాను అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయనను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రశంస పత్రం అందించి అభినందించారు. ఈ విషయం తెలుసుకొని మోర్తాడ్ ఏపీవో శకుంతల, ఉపాధి హామీ సిబ్బంది ఆయనను అభినందించారు. మండల కేంద్రములో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు మిఠాయిలు పంచి సంభారం చేసుకున్నారు. కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్డెంట్ ప్రతిమా రాజ్, ఐసీడీఎస్ పీడీ రాసులుబీ తదితరులు పాల్గొన్నారు.