ప్రారంభానికి సిద్ధమైన హనుమాన్ ఫారం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ డివిజన్ పరిధిలోని నవీపేట్ మండలం హనుమాన్ ఫారం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్ పిడీసీఎల్) ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఉపకేంద్రానికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. చీఫ్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్) చౌహాన్ జైవంత్ రావు, జిల్లా ఎస్‌ఈ (ఆపరేషన్) పీవీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు సాంకేతిక తనిఖీలు నిర్వహించారు. ఉపకేంద్రంలో ఎలాంటి సాంకేతిక లోపాలు...