Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 1:02 pm Posted by : ramakrishna

హన్మంతరావు కు ప్రభుత్వ సలహాదారు పదవి

 

. . . బీసీ సంక్షేమ శాఖ సలహాదారు గా నియామకం

 హైదరాబాద్, బతుకమ్మ:

కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హన్మంత్ రావు ప్రభుత్వ సలహాదారు గా నియామకం అయ్యారు. బీసీ సంక్షేమ శాఖ సలహాదారు గా వి. హన్మంతరావు (హన్మంతన్న) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ  రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈ నెల 29న ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ ర్యాంక్ హోదాతో ఈ మేరకు నియామక ప్రక్రియ జరుగుతుంది, సంబంధిత నియామకాలు, ఇతర విధులు బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో పని చేయాలని ఉత్తర్వులలో పెర్కోన్నారు. ఇటివల కాలంలో కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. సీనియర్ లకు గౌరవం ఇస్తు పదవుల భర్తీ రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టింది.

 

Hanmantha Rao Government Advisor post
Hanmantha Rao Government Advisor post