Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 5:36 pm Posted by : ramakrishna

పెన్షన్ పంపిణీలో చేతివాటం

  • రూ.16 చిల్లర లేవంటూ ఎగనామం
  • డబ్బులు కాజేస్తున్న పోస్టల్ సిబ్బంది
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ: వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్ డబ్బులు ఆసరాగా ఉంటాయని ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ పంపిణీ చేస్తుంది. పోస్టఫీస్ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ప్రతి నెల రూ.16 చిల్లర ఇవ్వకుండా నొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడ విచారణ చేపట్టినా.. ఆరా తీసినా ఇదే స్పష్టమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలల్లో పోస్టల్ సిబ్బంది పింఛన్ లబ్దిదారులకు చిల్లర రూ.16 ఇవ్వడం లేదని, ఐదు వందలు, వందల నోట్లు ఉన్నాయంటూ బ్యాంక్ అధికారులు పెద్దనోట్లు ఇస్తున్నారని ఏదో ఒక సాకు చూపించి రూ.16 ఇవ్వకుండా తమ జేబులో వేసుకుంటున్నారని పింఛన్ దారులు వాపోతున్నారు.  ఒకరిద్దరు లబ్దిదారుల నుంచే చేయూత పథకం కింద అందజేసే పెన్లను సొమ్మును తపాలాశాఖ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. రూ. 2016, రూ.4.016 అందజే యాల్సి ఉండగా.. రూ. 2 వేలు, రూ. 4 వేలు ఇచ్చి పంపించేస్తున్నారు. కొన్నిచోట్ల రూ. 2010. 4,010 నింపుకొంటున్నారు. లెక్క ప్రకారం.. పింఛన్ పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి అక్కడే ఉండాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్ డబ్బులు పంపిణీ చేయడంలో చేతివాటం ప్రదర్శిస్తున్న పోస్టల్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని పింఛన్ దారులు కోరుతున్నారు.

Handshake in pension distribution