బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో గత రెండు నెలల క్రితం మోర్తాడ్ గ్రామానికి చెందినా పోల్కారి శ్రవణ్, సుతరి పరమేష్ ఇద్దరు వారి యొక్క మొబైల్ సెల్ ఫోన్లను మోర్తాడ్ లో పోగొట్టుకున్నారు. ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పోర్టల్ నందు నమోదు చేసి పోర్టల్ ఆధారంగా సెల్ ఫోన్ ఆచూకీ తెలుసుకొని సెల్ ఫోన్ ను పోల్కారి శ్రవణ్, సుతరి పరమేష్ లకు శుక్రవారం మోర్తాడ్ ఎస్.ఐ బి.విక్రమ్ అప్పగించారు. దీంతో ఫోన్లు దొరకడంతో ఇద్దరు పోలీస్ సిబ్బంది కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
