Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 7:20 pm Posted by : ramakrishna

 మినీ ట్యాంక్ బండ్ నిర్వహణ భాధ్యతలను కార్పొరేషన్ కు అప్పగించండి

 

. . .  ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే ధనపాల్ సూచన

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

నగరంలోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్వహణను కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. గురువారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మినీ ట్యాంకు పండు పై మరమ్మత్తులు చేయించి, వాటి నిర్వహణను కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలని తెలిపారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ పై సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. వీలైనంత తొందరగా అప్పగించాలని ఆదేశించారు.

Hand over the maintenance responsibilities of the Mini Tank Bund to the Corporation

… మున్సిపల్ కమిషనర్ తో భేటీ….

మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ప్రధానంగా బోధన్ రోడ్ లో గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిస్థితి, పాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అమ్మ వెంచర్ సమీపంలో బ్రిడ్జి ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించారు. నగరంలోని రోడ్లపై ప్యాచ్ వర్క్, రూ.5 కోట్ల స్పెషల్ ఫండ్ స్టేటస్ ను అడిగి తెలుసుకున్నారు.