శిఖర ప్రతిష్టాపన చేసిన హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శుభం కరోతి కళ్యాణ గణపతి దేవాలయం నూతన శిఖర ప్రతిష్టాపన హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి చేతుల మీదుగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఇందూర్ నగరానికి విచ్చేసిన ఆయన భారతి నగరంలోని ఎల్లమ్మ గుట్ట గణేశ్ చౌక్ లో గల గణపతి దేవాలయం నూతన శిఖర ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నప్రసాదాలు విస్తృతంగా నిర్వహించాలని, ఆ విగ్నేశ్వర భగవంతుని...