Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 7:00 pm Posted by : ramakrishna

శిఖర ప్రతిష్టాపన చేసిన హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

శుభం కరోతి కళ్యాణ గణపతి దేవాలయం నూతన శిఖర ప్రతిష్టాపన హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి చేతుల మీదుగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఇందూర్ నగరానికి విచ్చేసిన ఆయన భారతి  నగరంలోని ఎల్లమ్మ గుట్ట గణేశ్ చౌక్ లో గల గణపతి దేవాలయం నూతన శిఖర ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నప్రసాదాలు విస్తృతంగా నిర్వహించాలని, ఆ విగ్నేశ్వర భగవంతుని ఆశీస్సులు ఇందూరు నగర ప్రజలకు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రఘువీర్ గోపాల్, కార్యదర్శి శ్యాంసుందర్, అగర్వాల్ ఆలయ కమిటీ సభ్యుడు న్యాయవాదులు రాజ్కుమార్, సుబేదార్ జగన్మోహన్ గౌడ్, నీలకంఠ రావు, వసంత్ రావు, రణవీర్, భూపాల్, ఆలయ పూజారిలు కిశోర్, శివ్ కుమార్, దీపు తదితరులు పాల్గొన్నారు.