బ్యాంకులో రైతుల అర్ధనగ్న నిరసన

ఆదిలాబాద్, బతుకమ్మ :  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో రైతులు అర్దనగ్న ప్రదర్శనతో తమ నిరసన వ్యక్తం చేశారు. తమ ఖాతాల్లో ఉన్న నగదు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బైఠాయించారు. రైతుల నిరసనతో బ్యాంకులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం రైతులు, బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడారు. బ్యాంక్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది తాంసి మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన...