హాజీ మహమ్మద్ కరీం సాబ్ మృతి
నందిపేట్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా లో ప్రసిద్ధి గాంచిన నందిపేట్ మండలం మల్లారం దర్గా బాబా హాజీ మహమ్మద్ కరీం సాబ్ బుధవారం ఉదయం మృతి చెందారు. కొంత కాలం గా అనారోగ్యం తో బాధ పడుతున్న బాబా ఇవాళ తుది శ్వాస విడిచారు. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తుల సందర్శనార్థం బాబా పార్థివ దేహాన్ని మల్లారం లోని తన స్వగృహం లో అందుబాటులో ఉంచానున్నారు. బాబా అంత్యక్రియలు శుక్రవారం జరపనున్నారు.