Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2024, 3:58 pm Posted by : ramakrishna

హైమద్ పటేల్ సేవలు ఎనలేనివి

బిచ్కుంద, బతుకమ్మ: మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ పాలకుడిగా విధులు నిర్వర్తించిన షేక్ నిసార్ హైమద్ పటేల్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనను ఆదివారం ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, పాఠకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైమద్ పటేల్ సేవలు ఎనలేనివని, పదవీ విరమణ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహిపతి హన్మాండ్లు, గండ్ల మహేశ్, కాంగ్రెస్ నాయకులు సాయిని అశోక్, సీమ గంగారాం, ఉపాధ్యాయులు రచ్చ శివకాంత్, జ్ఞానేశ్వర్, అంజయ్య, పాఠకులు వినోద్, బాలు సార్ తదితరులు పాల్గొన్నారు.


Haimad Patel's services are immeasurable