బీసీ సంక్షేమ శాఖ మినిస్టీరియల్ రాష్ట్ర అధ్యక్షులుగా హెచ్.రేవంత్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా నిజామాబాద్ జిల్లావాసి, సిరిసిల్ల బీసీడీఓ సీనియర్ అసిస్టెంట్ హెచ్. రేవంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ సమావేశ మందిరంలో శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పర్యవేక్షకులుగా గ్రేటర్ హైదరాబాద్ టీఎన్జీఓ అధ్యక్షులు శ్రీకాంత్ వ్యవహరించారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు రేవంత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆయన ప్రకటించారు. అలాగే యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం జిల్లాకు చెందిన ఏవో...