కోర్టు ఆవరణలో గుట్కా, పాన్ మసాలా దహనం

 బతుకమ్మ, బోధన్ : వివిధ కేసులలో  పట్టుబడ్డ నిషేధిత గుట్కా పాన్ మసాలా విక్రయాలు జరుపుతున్న వారిని పట్టుకొని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా నేరం నిరూపితమై శిక్ష విధించారు. ఈ కేసు దర్యాప్తు అనంతరం బుధవారం సుమారు రూ.50 వేల విలువ గల గుట్కా పాన్ మసాలాను కోర్టు ఆవరణంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి సమక్షంలో  దగ్ధం చేశారు. ఎవరైనా అక్రమ గుట్కా పాన్ మసాలాలను క్రయ విక్రయాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.