జ్వరంతో గురుకుల విద్యార్థి మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థిని అనారోగ్యం తో మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది.  మెండోరా మండలం పోచంపాడ్ గురుకుల పాఠశాల ఎనిమిదో తరగతి చదువుతున్న సాయి లిఖిత (13) డెంగీ  జ్వరంతో బాధ పడుతూ చికిత్స పొందుతూ మృతి చెందింది. గురుకుల ప్రిన్సిపాల్ సిబ్బంది నిర్లక్ష్యంతో  తమ కూతురు మృతి చెందిందని మృతదేహం తో బంధువుల ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.