విద్యుత్ షాక్ తో గురుకుల అటెండర్ మృతి
భిక్కనూరు, బతుకమ్మ: మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ లో ఉన్న గురుకుల పాఠశాల అటెండర్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. సోమవారం ఉదయం వాటర్ ట్యాంక్ కడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ ను పాఠశాల సిబ్బంది లింగం, ఆరోజ్ కుమార్, భాస్కర్ శుభ్రం చేస్తుండగా ట్యాంక్ పైన ఉన్న విద్యుత్ వైర్లకు ఇనుప నిచ్చెన తగలడంతో విద్యుత్ షాక్ కు గురై లింగం అక్కడికక్కడే మృతిచెందగా ఆరోజ్ కుమార్ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై ఆంజనేయులు, విద్యుత్ సిబ్బంది...