Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 2:11 pm Posted by : ramakrishna

విద్యుత్ షాక్ తో గురుకుల అటెండర్ మృతి

భిక్కనూరు, బతుకమ్మ: మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ లో ఉన్న గురుకుల పాఠశాల అటెండర్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. సోమవారం ఉదయం వాటర్ ట్యాంక్ కడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ ను పాఠశాల సిబ్బంది లింగం, ఆరోజ్ కుమార్, భాస్కర్ శుభ్రం చేస్తుండగా ట్యాంక్ పైన ఉన్న విద్యుత్ వైర్లకు ఇనుప నిచ్చెన తగలడంతో విద్యుత్ షాక్ కు గురై లింగం అక్కడికక్కడే మృతిచెందగా ఆరోజ్ కుమార్ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై ఆంజనేయులు, విద్యుత్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Gurukul attendant dies of electric shock